
హైదరాబాద్: శోభాయాత్ర.. ఈ రూట్లు బంద్!
శ్రీ రామనవమి శోభాయాత్ర సందర్భంగా ఆదివారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. సౌత్ వెస్ట్ జోన్లో ఉ.9 నుంచి సా. 4 వరకు, ఈస్ట్ జోన్లో మ.2 నుంచి రా. 9 వరకు ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది. 20 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు. సీతారాంబాగ్, బోయిగూడ కమాన్, ఎంజే మార్కెట్, పుత్లీబౌలి మీదుగా సుల్తాన్‌బజార్‌కు ర్యాలీగా వెళ్తారు. ప్రత్యామ్నాయ రూట్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.