
షాద్ నగర్ జిల్లా కోర్టు నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం
షాద్ నగర్ బార్ అసోసియేషన్ ఎన్నికలలో గెలిచినటువంటి అభ్యర్థులకు బుధవారం షాద్ నగర్ బార్ అసోసియేషన్ హాలులో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమము రాజాశేఖర్ రాజు ఆధ్వర్యంలో అభ్యర్థుల చేత ప్రమాణం చేయించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గా వేణుగోపాల్ నర్వ, వైస్ ప్రెసిడెంట్ గా చిపిరి చంద్ర శేఖర్ యాదవ్, జనరల్ సెక్రటరీగా శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీగా నర్సింలు ప్రమాణ స్వీకారం చేశారు.