ఎల్బీనగర్
దళితులపై దాడులు ఖండించాలి
సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం గణేష్ నిమర్జన వేడుకల్లో దళిత మహిళపై జరిగిన దాడిని కండిస్తూ మాల జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య ని కలిసి వినతిపత్రం అందజేశారు. చెన్నయ్య మాట్లాడుతూ దళిత మహిళపై దాడి చేసిన వారిపై సాధారణ చట్టాల కింద కేసు నమోదు చేశారని ఇంటెన్షన్ గా హత్య చేయాలనే కుట్రతో దాడి చేశారు కాబట్టి నాన్ బెయిలబుల్ కేస్ పెట్టి అరెస్టు చేసి రిమాండ్ చేయాలని కోరారు.