కుత్బుల్లాపూర్
తిరుపతి లడ్డూ అపవిత్రం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీపై కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్లలోని హిందూ సామాజిక సేవకర్త గోపి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద శనివారం కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. జీడిమెట్ల వద్ద దుర్గమాత ఆలయం నుండి మహాత్మా గాంధీ విగ్రహం వరకు వారి మిత్రబృందంతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, లడ్డు కల్తీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అన్నారు.