హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా 600 ప్రత్యేక బస్సులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈనెల 17న గణేష్ నిమజ్జనోత్సవం, శోభాయాత్ర నేపథ్యంలో టీజీఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీగా ప్రత్యేక బస్సులను నడపనుంది. వినాయక నిమజ్జనోత్సవం వేళ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు 600 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కో డిపో నుంచి గరిష్ఠంగా 30 నుంచి కనీసం 15 బస్సులను నడపనున్నట్లు తెలిపారు.