మిరుదొడ్డి: చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకారం ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, పీఏసిఎస్ చైర్మన్ రాజలింగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ప్రభుత్వ కేంద్రాలలో వరి ధాన్యాన్ని అమ్ముకోవాలని రైతులను కోరారు.