దుబ్బాక: రైతులు ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు రావాలి
ఆసక్తి గల రైతులు ఆయిల్ ఫామ్ వేయుటకు ముందుకు రావలెనని వ్యవసాయ శాఖ అధికారులు ప్రవీణ్ కుమార్, అన్వేష్, ఆయిల్ ఫెడ్ అధికారి అరవింద్ శనివారం అన్నారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్, చీకోడు, పెద్దగుండవెల్లి గ్రామాలలో ఆయిల్ ఫామ్ తోటలను సందర్శించి మాట్లాడుతూ 20 నుండి 30 నెలల వయసులో ఉండి గెలలు వచ్చే దశలో ఉన్నవని, ఈ పరిస్థితులలో పంటలో ఎరువులు సమర్థవంతంగా చేసినచో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందన్నారు.