సంగారెడ్డి: కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి దత్తు రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం సరికాదని చెప్పారు. అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కలెక్టరేట్ ఏవో పరమేశంకు వినతి పత్రం సమర్పించారు.