Oct 28, 2024, 16:10 IST/
హైడ్రా కమిషనర్ కీలక సూచనలు
Oct 28, 2024, 16:10 IST
అబిడ్స్ బొగ్గులకుంటలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైన క్రాకర్స్ దుకాణ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన క్రాకర్స్ దుకాణాన్ని ఆ పక్కనే ఆహుతి అయిన టిఫిన్ సెంటర్ను పరిశీలించి ప్రమాదానికి కారణాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. టపాసుల దుకాణదారులు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.