
ఓదెల: రైతులు పాడి పశువులను పెంచాలి
రైతులు వ్యవసాయంతోపాటు పాడి పశువులను పెంచాలని పశు వైద్యాధికారి డాక్టర్ మల్లేశం అన్నారు. బుధవారం ఓదెల మండలం పెద్ద కొమిర గ్రామంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సూపర్ వైజర్ రాఘవ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భకోశ వ్యాధి, చూడి పరీక్ష, దూడలకు నట్టల నివారణ మందులు అందించారు. ఈ కార్యక్రమంలో గోపాల మిత్రులు ప్రవీణ్, మహెశ్, ఓదెలు పాల్గొన్నారు.