ఆందోలు: 11 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు
సంగారెడ్డిలో ఈ నెల 11 - 17వ తేదీ వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్‌ను https: // bse. telangana. gov. in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కరుణ, సెయింట్ ఆంథోనీ శాంతి నగర్, సెయింట్ ఆంథోనీ విద్యానగర్ పాఠశాలలలో పరీక్షలు జరుగుతాయని చెప్పారు.