రాయికోడ్: చైనా మాంజాను విక్రయిస్తే కఠిన చర్యలు
మండలంలోని అన్ని దుకాణాల్లో గాని ఇతర వాణిజ్య సముదాయాల్లో ఎవరైనా నిషేధిత చైనా మాంజా దారంను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల సబ్ ఇన్స్పెక్టర్ ఎస్. నారాయణ మంగళవారం హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అన్ని దుకాణాల్లో తనిఖీ చేసి మాంజా దొరికితే చర్యలు తీసుకుంటామని అలాగే పిల్లలు, పెద్దలు, యువకులు ఎవరు కూడా చైనా మాంజాను కొనడం, ఉపయోగించడం మానుకోవాలని సూచించారు.