ఊట్కూరు: గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్లు
ఊట్కూరు బాలికల గురుకుల పాఠశాలను బుధవారం రాత్రి కలెక్టర్ సిక్తా పట్నాయక్, ట్రైనీ కలెక్టర్ గరిమానరులతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినిలకు వండిన భోజనాన్ని పరిశీలించారు. టీచర్స్, మెస్ కమిటీతో భోజనం ఎలా ఉంటుందని అడిగి తెలుసుకున్నారు. ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మాట్లాడుతూ భోజనం చేశారు. రాత్రి పాఠశాలలోనే కలెక్టర్లు బస చేశారు.