‘దేవర’ టికెట్ రేట్లు భారీగా పెంపు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. ఈ నెల 27న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచేందుకు తెలుగు రాష్ట్రాలు అనుమతి ఇచ్చాయి. తెలంగాణలోని మల్టీఫ్లెక్స్‌లలో రూ.413, సింగిల్ స్క్రీన్లలో రూ.250 వరకు టికెట్ రేట్లు పెంచారు. ఏపీలోని మల్టీఫ్లెక్స్‌లలో రూ.325, సింగిల్ స్క్రీన్లలో రూ.200 వరకు పెంచేందుకు అవకాశం కల్పించింది.