నవయుగ వైతాళికుడు గురజాడ
తెలుగు భాషా సాహిత్యాలను, సామాజిక చైతన్యాన్ని గొప్ప ముందంజ వేయించిన సంస్కర్త-మహాకవి గురజాడ అప్పారావు. రాజు నుంచి రోజు కూలీ దాకా సమకాలీనులను అమితంగా ప్రభావితం చేసిన నవయుగ వైతాళికుడు. స్త్రీలను తొక్కిపెట్టే నాటి శిథిల సమాజంపై ‘కన్యాశుల్కం’ నాటకంతో అగ్నివర్షం కురిపించిన కలం యోధుడు గురజాడ. దేశభక్తి, ఆధునిక కవిత్వం, ప్రేమ, స్త్రీ సంస్కరణ, సంఘ చైతన్యం వంటివెన్నో ఉదాత్త వినూత్న భావాలను నిర్వచించి, నిర్వహించిన కార్యకర్త గురజాడ. రేపు ఆయన 162వ జయంతి.