డుంబ్రిగుడ: నెలవంక అందాలు చూడ తరమా
ప్రకృతి అందాలకు నెలవైన అల్లూరి మన్యంలో బుధవారం ఆహ్లాదకరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం ఏఓబి సరిహద్దు చటువాలోని ఆకాశంలో అరుదైన దృశ్యం కనిపించింది. అమావాస్య అయిన మూడు రోజుల తర్వాత బుధవారం సాయంత్రం ఆకాశం ఎర్రబడి చందమామ నెలవంక కనిపించడంతో ప్రజలు ముగ్దులయ్యారు. కొండలను ముద్దాడుతన్నట్లు ఉన్న నెలవంక చిత్రాలను స్థానికులతో పాటు పర్యాటకులు తమ ఫోన్లలో బంధించారు.