ముంచంగిపుట్టు: సావిత్రిబాయి పూలే అడుగుజాడల్లో నడుద్దాం
ముంచంగిపుట్టు మండలంలోని జర్రేల ఎంపీపీ పాఠశాల వద్ద దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ భాగ్యవతి పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సమాజ స్థాపన కోసం అనునిత్యం ప్రజలను చైతన్యం చేశారన్నారు. ప్రతి ఒక్కరు ఆమె అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.