కళ్యాణదుర్గం: ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య
కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో న్యూ ఇయర్ రోజు విషాద ఘటన జరిగింది. ఎర్రనేల వీధికి చెందిన రెహనాబి బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. ప్రాణం ఉందనే ఆశతో కుటుంబ సభ్యులు కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.