ఈ క్రాప్ నమోదు గడువు పెంపు
యల్లనూరులో రైతులు సాగు చేసిన పంటలకు ఈ క్రాప్ నమోదు గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ సోమవారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా వంద శాతం ఈ క్రాప్ నమోదు పూర్తి చేసినట్లు ఏఓ తెలిపారు. ఇంకా ఎవరైనా ఈ క్రాప్ చేసుకోకపోతే ఈ నెల 23వ తేదిలోపు చేసుకోవాలని కోరారు.