తాడిపత్రి: బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న జేసీ
తాడిపత్రి పట్టణ కేంద్రంలో కొలువైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామిని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి వేడుకలు సందర్భంగా దర్శన నిమిత్తం వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణలు నడుమ స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.