సంక్షేమ పథకాలు అందాలంటే జగనన్నని సీఎం చేసుకుందాం: మంత్రి
శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాలకూరు పంచాయతీ పరిధిలోని గుడ్డం నాగేపల్లి గ్రామంలో బుధవారం రాష్ట్ర మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషా శ్రీచరణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు మంత్రి కి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి గ్రామంలో పర్యటిస్తూ జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ తిరిగి జగనన్న ను సీఎం ను చేసుకుందాం అని కోరారు.