రాయదుర్గం: ఘనంగా అమరవీరుల దినోత్సవం
రాయదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ సీఐ జయానాయక్ మాట్లాడుతూ పోలీసుల త్యాగాలు మరువలేనివి అన్నారు. దేశ భద్రతకు ప్రజల మానప్రాణాలకు రక్షణ కోసం వారి సేవలను స్మరిస్తూ అమరవీరుల వారోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు వలి, బాలరాజు, ఏఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు.