ఉరవకొండ: ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొని మహిళా కూలీ మృతి
కూడేరు మండలం కొర్రకోడు-జల్లిపల్లి గ్రామాల మధ్య బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కొర్రకోడు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ అనసూయమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.