కుటుంబ కలహాలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణ పరిధిలోని బజారు వీధిలో ఉంటున్న నారాయణప్ప కుమారుడు రంజిత్ కుమార్ (30) కుటుంబ కలహాలతో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు కలరు. ఘటన బుధవారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు వెలుగులోకి వచ్చింది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.