
కాకినాడ రూరల్: పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
కాకినాడ రూరల్ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. గురువారం కాకినాడ రూరల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ లో శారవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కాకినాడ బీచ్ ను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.