
కరప: మండల పరిషత్ సర్వసభ్య సమావేశం
కరప మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీపీ శ్రీలక్ష్మీ సత్తిబాబు అధ్యక్షతన జరిగింది. ఎంపీడీవో అనుపమ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ. 1.05 లక్షల మిగులు బడ్జెట్ ను ఆమోదించారు. మంచినీటి సమస్యపై సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. కోరం లేక సమావేశం గంటన్నర ఆలస్యంగా జరిగింది. జడ్పీటీసీ యళ్ల సుబ్బారావు, సర్పంచులు, ఎంపీటీసీలు హాజరయ్యారు.