పూడిక తీత పనుల పరిశీలించిన ఎమ్మెల్యే
సామర్లకోట గాంధీ బొమ్మ సెంటర్లో మునిసిపాలిటీ ఆధ్వర్యంలో కాలువల పూడిక తీత పనులను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప శనివారం సాయంత్రం పరిశీలించారు. గాంధీ బొమ్మ, సెంటర్ నుంచి రైలు గేటు వరకు ప్రధాన కాలువలో పూడిక తీత పనులను పరిశీలించి తాగు సూచనలు చేశారు. మునిసిపల్ కమీషనర్ శ్రీవిద్య సామర్లకోట టీడీపీ నాయకులు పాల్గొన్నారు.