అమలాపురం: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పీజిఆర్ఎస్ రద్దు

55చూసినవారు
అమలాపురం: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పీజిఆర్ఎస్ రద్దు
గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రతి సోమవారం అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని అన్ని జిల్లా, డివిజన్, మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలలో పీజీఆర్ఎస్ జరగదని ప్రజలు గమనించాలన్నారు.

సంబంధిత పోస్ట్