కలెక్టరేట్ వద్ద చెట్టు కొమ్మలతో నిరసన
కాకినాడ కలెక్టరేట్ వద్ద కోనో కార్పస్ వృక్షాలను తొలగించాలని కోరుతూ సామాజిక నేత దుసర్లపూడి రమణరాజు నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ చెట్లను తొలగించాలంటూ ఆదేశాలు ఇచ్చినా, అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం వేప, గానుగ వంటి స్వదేశీ వృక్షాలను నాటాలని ఆయన సూచించారు.