కాకినాడ ఎన్టీఆర్ బీచ్ సుందరీకరణ పనులు నెల రోజుల్లో పూర్తిచేసి సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కాకినాడ రూరల్ సూర్యాపేట- ఎన్టీఆర్ బీచ్ లో జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్ షణ్మోహన్, పర్యాటక, కాకినాడ నగరపాలక సంస్థ, పంచాయతీ, కుడా తదితర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. కాకినాడ సముద్ర తీర ప్రాంతంలోఅభివృద్ధిపనులను పరిశీలించారు.