రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో సోమవారం మహిళా సాధికారిత సెల్ కన్వీనర్ జి. సుమలత ఆధ్వర్యంలో వైస్ ప్రిన్సిపల్ యు. రమేష్ బాబు అధ్యక్షతన "బాల్యవివాహాలు వాటి నివారణ చట్టాలు"అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సుఏర్పాటు చేయడం జరిగినది. దీనికి ప్రత్యేక ఆహ్వానితులుగా రాజమండ్రి కోర్టు నుండి న్యాయవాది యస్. విమల విచ్చేసి విద్యార్థుల నుద్దేశించి మాట్లాడారు.