కొత్తపేట: గీత కులాల మద్యం షాపుల లైసెన్స్ ఫీజు తగ్గించాలి
కూటమి ప్రభుత్వం గీత కులాలకు 335 మద్యం షాపులు రిజర్వేషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల ప్రభుత్వానికి కొత్తపేట నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బొక్కా ప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటనలను విడుదల చేశారు. గీత కులాలు యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని మద్యం షాపుల దరఖాస్తు రుసుం తగ్గించాలని కోరారు.