మండపేట లో 17 నుంచి ఆధార్ ప్రత్యేక క్యాంపులను నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు మునిసిపల్ కమిషనర్ టి. వి. రంగారావు తెలిపారు. స్థానిక మునిసిపల్ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఈనెల17 వ తేదీ నుండి 20వ తేదివరకు 26వతేది నుండి 30వరకు రెండు దఫాలుగా నిర్వహించనున్నట్లు చెప్పారు. పట్టణ ప్రజలు ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ పిలుపునిచ్చారు.