గంగవరం: పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై సమావేశం

83చూసినవారు
గంగవరం: పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై సమావేశం
గంగవరం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై అవగాహన పెంచుకొని సరైన నివేదిక తయారు చేయాలని ఎంపీడీవో పీజీ రామకృష్ణ అన్నారు. సర్పంచులు ఎంపీటీసీలకు సోమవారం శిక్షణ కార్యక్రమం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి మాట్లాడుతూ. గ్రామాల్లో మౌలిక వసతులకి అధిక ప్రాధాన్యత ఇచ్చి నివేదిక తయారు చేస్తే బాగుంటుందన్నారు.

సంబంధిత పోస్ట్