రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కు 51 దరఖాస్తులు వచ్చాయని పీవో కట్టా సింహాచలం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పలు గ్రామాలకు రహదారులు నిర్మించాలని, పక్కా గృహాలు నిర్మించాలని, అంగన్వాడీ కేంద్రాల భవనాలు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కొన్ని సమస్యలను సమావేశంలోనే పరిష్కరించారు. పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.