రంపచోడవరం మండలం పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రాన్ని అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. కేంద్రంలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. ఆధునిక పద్ధతుల్లో మొక్కలు పెంచడం ద్వారా అధిక ఫలసాయం వచ్చేలా రైతులకు శిక్షణ ఇవ్వాలని అధికారులను సూచించారు. కోళ్లు, చేపల పెంపకం కేంద్రాలను పరిశీలించారు.