రంపచోడవరం: నిందితుడిని శిక్షించాలని నిరసన

66చూసినవారు
రంపచోడవరం: నిందితుడిని శిక్షించాలని నిరసన
రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి పిహెచ్సిలో పనిచేస్తున్న ఉద్యోగినిపై దాడి చేసిన ప్రవీణ్ కుమార్ ను కఠినంగా శిక్షించాలని ఆదివాసి వైద్యారోగ్య ఉద్యోగుల ఆదేశాల మేరకు సోమవారం దేవీపట్నం మండలంలోని ఇందుకూరుపేట పిహెచ్సిలో నల్ల రిబ్బన్లు ధరించి ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. మన్యంలోని ఆరోగ్య కేంద్రాల్లో రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రక్షణ కల్పించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్