

మలికిపురం: సూపర్ సిక్స్ ను అమలు చేయలేకపోయారు
ఇచ్చిన హామీలు అమలు చేయలేక కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వతంత్ర అభ్యర్థి సుందర్ తరపున ఆయన మంగళవారం మలికిపురంలో ప్రచారం నిర్వహించారు. సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు అమలు చేయలేక చేతులెత్తేయడంతో ప్రజల్లో ఆదరణ కోల్పోయారని విమర్శించారు.