పేకాట శిబిరంపై దాడి.. 8 మంది అరెస్ట్
సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం గ్రామంలో పేకాట శిబిరంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నామని సఖినేటిపల్లి ఎస్ఐ దుర్గా శ్రీనివాస్ తెలిపారు. వారి నుంచి రూ. 10, 600 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.