గుడివాడ: హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం
ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గుడివాడ 30వ వార్డులో 20 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించిన శాసనసభ్యులు వెనిగండ్ల రాముకు ఆదివారం స్థానిక నివాసితులు ధన్యవాదాలు తెలియజేసి కూటమి నేతలతో కలిసి కృతజ్ఞతపూర్వక కార్యక్రమాన్ని నిర్వహించారు.