నూజివీడు పరిసరాలలో అరుదైన గద్ద జాతి పక్షి
నూజివీడు మండలం దేవరగుంట సమీపంలోని అడ్డరోడ్డు వద్ద గురువారం ఓ వింత పక్షి ప్రత్యక్షమైంది. భారీ సైజులో ఉన్న పక్షిని ప్రజలు వీక్షించి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వింత ఆకారంతో పెద్ద పెద్ద ఈకలతో పక్షి సంచరిస్తుంది. నూజివీడు అటవీ అధికారి వీరన్న రాజూ దీనిపై మాట్లాడుతూ. ఇది డీప్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ఓ గద్ద జాతికి చెందిన పక్షి అని, జనావాసాల్లోకి రావడం అరుదన్నారు.