ముసునూరులో అక్రమ మద్యం పై దాడులు
అక్రమ మద్యం అమ్మకాలపై ఏలూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం రాత్రి ముసునూరు గ్రామంలో దాడులు చేశారు. ఏలూరు సీఐ ఫణి కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఈ దాడులు నిర్వహించారు. ముసునూరు గ్రామానికి చెందిన వ్యక్తులు బెల్ట్ షాప్ లు నిర్వహిస్తున్నారని అధికారులకు సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించినట్లు సీఐ తెలిపారు. 40 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.