కారంపూడిలో గ్రానైట్ లారీ పట్టివేత
కారంపూడిలోని ఓ ఫ్యాక్టరీ వద్ద పోలీసులు గ్రానైట్ లారీని పట్టుకున్నారు. వినుకొండ వైపు నుంచి కారంపూడి వైపు వస్తుండగా పోలీసులు లారీని తనిఖీ చేయగా గ్రానైట్ లోడుతో వెళ్తున్నట్లు గుర్తించారు. సరైన పత్రాలు చూపించక పోవడంతో లారీని పోలీస్ స్టేషన్క తరలించారు. శుక్రవారం కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ టీవీ శ్రీనివాసరావు తెలిపారు.