మాచర్ల: సాగర్ జలాశయంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మాచర్ల మండలం నాగార్జున సాగర్ కృష్ణా జలాశయంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. విజయపురిసౌత్ ఎస్ఐ షేక్ మహమ్మద్ షఫీ తెలిపిన వివరాల ప్రకారం.. విజయపురిసౌత్ లోని మేకల గొంది సమీపం లోని కృష్ణా జలాశయం వద్ద ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. ఎస్ఐ మహమ్మద్ షఫీ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.