పాలకొల్లు: రేపటి నుండే ప్రైవేట్ మద్యం షాపులు ప్రారంభం
రేపటి నుండి నూతన మద్యం ప్రైవేటు షాపులు ద్వారా మద్యం విక్రయాలు జరుగుతాయని అందుబాటులోకి పాత బ్రాండ్ల మద్యం ప్రభుత్వం తీసుకు వస్తోందని పాలకొల్లు ఎక్సైజ్ సిఐ మద్దాల శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం సీఐ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం విధానం 2024 - 26 కు సంబంధించి పాలకొల్లు ఎక్సెజ్ శాఖ పరిదిలోని 19 షాపులకు 873 దరఖాస్తులు వచ్చాయని ఒక్కో షాపుకు సగటున 46 మంది పోటీపడ్డారని తెలిపారు.