పాణ్యం: పెద్దపాడు వంక సమస్యపై కలెక్టర్ స్పందించాలి
కల్లూరు మండలం పెద్దపాడులోని వంక భూమిని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని సోమవారం సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జి. రామకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలులో సీపీఎం నాయకులు, గ్రామస్తులతో కలిసి కర్నూలులో డీఆర్ఓ చిరంజీవిని కలిసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. అక్రమంగా ఆక్రమించుకొని ప్లాట్లు వేసిన వారిపై జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా స్పందించి, చర్యలు తీసుకోవాలన్నారు.