ఆలూరు ఎమ్మెల్యే అనుచరుల హల్చల్!
ఆలూరు మండలం మొలగవల్లి, జోహరపురం గ్రామ సమీపంలో ఉన్న గమేసారి, న్యూ కంపెనీలకు చెందిన విండ్ పవర్ సబ్ స్టేషన్లపై ఆలూరు ఎమ్మెల్యే అనుచరులు గురువారం హల్చల్ చేశారు. ఆఫీసులో ఉన్న కంప్యూటర్లు, కిటికీ అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారని అక్కడి సిబ్బంది తెలిపారు. ఎమ్మెల్యేను కలవకుండా విధులు ఎలా నిర్వహిస్తారంటూ భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు.