ఆదోని : బన్నీ ఉత్సవాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఈ నెల 12న జరుగబోయే దేవరగట్టు బన్ని ఉత్సవాలలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. శనివారం దేవరగట్టులో జరిగిన సమీక్షా సమావేశంలో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ బన్ని ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో ఘనంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని గ్రామాల ప్రజలు పోలీసులకు సహకరించి బన్నీ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలాగా కృషి చేయాలని కోరారు.