సుప్రీంకోర్టులో వైసీపీ నేతలకు ఊరట
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేతలకు సుప్రీం కోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. దేవినేని అవినాశ్, జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాంకు ఊరట ఇచ్చింది. అయితే ముందస్తు బెయిల్ తీర్పును నవంబర్ 4కు వాయిదా వేసింది. వీరంతా 48 గంటల్లోగా పాస్‌పోర్టులు దర్యాప్తు అధికారులకు ఇవ్వాలని సూచించింది. విచారణకు సహకరించాలని ఆదేశించింది.