
దారుణం.. ఇద్దరిని నరికి చంపేశాడు
కేరళలోని పతనంతిట్ట జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తి తన భార్యతో సహా మరొక వ్యక్తిని నరికి చంపాడు. వివరాల్లోకి వెళ్తే.. కలంజూర్కు చెందిన బైజు, వైష్ణవి దంపతులు. అయితే వైష్ణవి పక్కింట్లో ఉంటున్న విష్ణుతో సన్నిహితంగా ఉండేది. ఈ విషయం బైజుకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.ఈ క్రమంలో కత్తి తీసుకొని భార్యను అలాగే విష్ణును నరికి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి బైజును అదుపులోకి తీసుకున్నాడు.